HomeMovie News'పెద్ది' డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్

‘పెద్ది’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ పెద్ది.

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వ్రిద్ది సినిమాస్ సంస్థ పై వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఆకట్టుకుని మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ 27 మార్చి 2026లో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ మొత్తంగా రూ. 110 కోట్లకు సొంతం చేసుకుంది.

మొత్తంగా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా పెద్ది మూవీ రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇందులో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందని, ఉప్పెన అనంతరం బుచ్చిబాబు సన దీనితో మరొక భారీ విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

See also  'థగ్ లైఫ్' సెన్సార్ అండ్ రన్ టైం డీటెయిల్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories